బిజినేపల్లి : విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలు ( Summer training camps ) నిర్వహిస్తుందని ఇన్చార్జి మండల విద్యాధికారి అభినందన్ శర్మ ( MEO Abhinandan Sharma ) అన్నారు. సోమవారం బిజినేపల్లి మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించారు
.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులలో సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, గణిత మూలాలు,యోగ,ఇండోర్ గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు వేసవి శిబిరాలు దోహదం చేస్తాయని అన్నారు. శిబిరాన్ని వినియోగించుకుని వ్యక్తిగత నైపుణ్యాలు, క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. విద్యార్థుతలు లక్ష్యాలను సాధించాలంటే ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు.
6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ శిబిరం వినియోగించుకోవాలన్నారు. ఈనెల 15 వ తేదీవరకు సమ్మర్ క్యాంప్ జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, ఉపాధ్యాయులు చంద్రమోహన్ రెడ్డి, వెంకట్ స్వామి, యాదగిరి, హుస్సేన్, నాగిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.