మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 20 : జాతీయ స్థాయి ప్రతిభ పురస్కారం, ఉపకార వేతనాలకు మహబూబ్నగర్ గ్రామీ ణ మండలం ధర్మాపూర్ సమీపంలోని జయప్రకాశ్ నారాయణ్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఆ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ శుక్రవారం విద్యార్థినులను అభినందించారు.
జాతీయస్థాయిలో ఈ ప్రతిభా వేతనాలకు దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాల నుంచి మొత్తం 130మంది వి ద్యార్థులు ఎంపిక కాగా తెలంగాణ నుంచి 15మంది విద్యార్థినులు ఎంపికయ్యారని అన్నారు. రాష్ట్రం నుంచి హిటాచీ గ్రీన్ స్కాలర్షిప్కు ఎంపికైన వారిలో జేపీఎన్సీఈ బీటెక్, ట్రిపుల్ ఈ ప్రథమ సంవత్స రం విద్యార్థినులు సీ పల్లవి, ఏ స్వాతి, ఎన్ శ్రీలత, ఏ పల్లవి, కే గాయత్రి, ఆర్ కావేరి, ఏ శృతి మొత్తం ఏడుగురు ఉండ డం ఎంతో సంతోషంగాను, గర్వంగాను భావిస్తున్నట్లు తెలిపారు.
జాతీయ స్థాయి లో ఉత్తమ విద్యార్థులుగా ఎంపికైన వారికి హిటాచీ కంపెనీ ఒక్కో విద్యార్థినికి ఒక ల్యాప్లాప్తో పాటు ప్రతి ఏడాది రూ.20 వేల చొప్పున ఉపకార వేతనం నాలుగేళ్లకు గాను రూ.80వేలు అందిస్తుందన్నా రు. ఈ స్కాలర్ షిప్లు విద్యార్థినుల ఉన్నతిలో ఆర్థిక ప్రోత్సాహకంగా నిలవనుందన్నారు. కార్యక్రమంలో జేపీఎన్సీఈ ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధన, సిబ్బంది పాల్గొన్నారు.