బాలానగర్, ఫిబ్రవరి 6 : పదో తరగతి విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువా రం ఉదయం బాలానగర్ బాలికల గురుకులంలో చో టు చేసుకున్నది. గురుకులం అధ్యాపకుల కథనం ప్ర కారం.. నాగరకర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లికి చెందిన ఆరాధ్య (15)తెల్లవారు జామున 5:30 గంటల వరకు స్టడీ అవర్‌లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నది. అనంతరం విద్యార్థులంతా స్నా నాలకు వెళ్తుండగా తానూ బకెట్ తీసుకొని స్నానానికి వెళ్లింది. బకెట్‌ను బాత్రూం బయటే వదిలేసి ఆ సమీపంలో ఉన్న ఓ చీర తీసుకొని ఏడో తరగతి గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నది. పుస్తకాల కోసం తరగతి గదిలోకి వెళ్లిన విద్యార్థులు గమనించి ప్రిన్సిపాల్ అంజన్‌రెడ్డి, ఇతర అధ్యాపకులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే వారు బాలికను షాద్‌నగర్ దవాఖానకు తరలించగా అప్పటికే ఆ విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బా లిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు స్థానిక జూనియర్ కళాశాల వి ద్యార్థులతో కలిసి గురుకులం గేటు ఎదుట ఆందోళనకు పూ నుకొని విద్యార్థిని కుటుంబాని కి న్యాయం చేయాలని డి మాండ్ చేశారు. విద్యార్థుల త ల్లిదండ్రులతో సమావేశం నిర్వహించనుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వి ద్యార్థుల తల్లిదండ్రులు, ఆం దోళన చేస్తున్న విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు, స్థాని క ప్రజాప్రతినిధులతో గురుకులం ఆవరణంంతా గందరగోళంగా మారింది.
పరిస్థితి చేయిదాటిపోతుండడంతో మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జునగౌడ్, ఆదిరెడ్డి, జడ్చర్ల నియోజకవర్గంలో ని రాజాపూర్, మిడ్జిల్ మండలాలకు చెందిన ఎస్సైలు, పోలీసులతో గురుకులం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, డీఈవో ప్రవీణ్‌కుమార్ తదితరులు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గురుకులానికి చేరుకొని బాలిక త ల్లిదండ్రులు రమేశ్, రజితలతో పాటు, గురుకులం అ ధ్యాపకులు, విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడారు. త మకు న్యాయం చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టర్ విజయేందిర ముందు విలపించా రు.
గురుకులంలోని అధ్యాపకుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇ వ్వాలని బాలిక తరపు బంధువులు డి మాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం చే స్తామని, ఔట్‌సోర్సింగ్‌లో బాలిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేయాలని ఎస్పీ జానకి పోలీసులను ఆదేశించారు.
Mahabubnagar2
మృతికి కారణమైన వారిని శిక్షించాలి
బాలానగర్ బాలికల గురుకులంలో పదో తరగతి చదువుతున్న తమ కుమార్తె ఆరాధ్య (15) మృతికి కా రణమైన వారిని కఠినంగా శిక్షించాలని బా లిక తండ్రి నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లికి చెందిన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం 8:15 గంటల ప్రాంతంలో గు రుకులం అధ్యాపకురాలు అనిత ఫోన్‌చేసి మీ కుమార్తెకు ఫిట్స్ వచ్చింది వెంటనే ర మ్మని చెప్పిందని, 9:30కు మరో అధ్యాపకురాలు ఫోన్‌చేసి మీ కుమార్తె చనిపోయిందని చెప్పారని, ఉదయం 11గంటలకు షాద్‌నగర్ దవాఖానలో ఆరాధ్య మృతదేహాన్ని పరీక్షించగా చేతులపై, కాళ్లపై కమిలిన గాయాలున్నాయని పేర్కొన్నారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ అంజన్‌రెడ్డి, అధ్యాపకురాలు అనిత తనను వేధిస్తున్నారని చెప్పిందని, వారి వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.