జడ్చర్ల, జూలై 30 : ఈనెల 16న హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో జరిగిన దొంతనం కేసులోని నిందితులను అరెస్టు చేసినట్లు ఎ స్పీ జానకి తెలిపారు. మంగళవారం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ (మోతినగర్) విద్యుత్‌శాఖలో పనిచేసే దామోదర్ తన అక్క భాగ్యలక్ష్మికి అవసరం నిమిత్తం తన వద్ద ఉన్న రూ.36 లక్షలు తీసుకొని ఈనెల 16న కర్నూల్ వెళ్లేందుకు ఎంజీబీఎస్ బస్టాండ్ (హైదరాబాద్) నుంచి కర్నూల్ వెళ్లే పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు.
ఈ క్రమంలో తన దగ్గ ర ఉన్న రూ.36లక్షల నగదు కలిగిన బ్యాగ్‌ను తన సీటు పైభాగంలో ఉన్న క్యాబిన్‌పై పెట్టి దానికింద సీటులో కూర్చున్నాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఎండీ షారుక్, అబ్దుల్ సత్తార్, షేక్ దిల్షాన్ అహ్మద్ డబ్బులు ఉన్న బ్యాగును గమనించిన వారు బాధితుడిని ఏమార్చి అ తడి బ్యాగులో ఉన్న రూ.36 లక్షల నగదును మరో బ్యాగులోకి మార్చారు. బా ధితుని బ్యాగులో నీళ్ల బాటిళ్లు పెట్టారు.
ఈ క్రమంలో బస్సు జడ్చర్ల ైప్లెవర్ దగ్గరకు రాగానే ఎండీ షారుక్, షేక్ దిల్షాన్అహ్మద్ బస్సులో నుంచి డబ్బుల బ్యా గుతో దిగి పోగా, మరో నిందితుడు అబ్దుల్ సత్తార్ జడ్చర్ల కొత్తబస్టాండ్‌లో బ స్సు దిగి వెళ్లిపోయాడని తెలిపారు. జడ్చర్ల కొత్తబస్టాండ్‌లో బస్సు ఆగిన తర్వాత బాధితుడు దామోదర్ టిఫిన్ చేయడానికని క్యాబిన్‌పై ఉన్న డబ్బుల బ్యాగును తీసుకోగా బ్యాగు బరువు తక్కువ అనిపించడంతో అనుమానం వచ్చి బ్యాగును తెరిచి చూడగా బ్యాగులో డబ్బులు కనిపించలేదు. అందులో వాటర్‌బాటిల్ ఉండడం చూసి బాధితుడు సమీపంలోని జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన జడ్చర్ల పోలీసులు దర్యాఫ్తును వేగవంతంగా చేపట్టారు. జడ్చర్ల- హైదరాబాద్‌లోని సీసీ పుటేజీల ఆధారంగా ఈ నెల 28వ తేదీన నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజునూరులో ఉన్నట్లు తెలుసుకొని అక్కడకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30లక్షల నగదు స్వాధీనం చేసుకొని బిజునూరు సీజేఎం కోర్టులో నిందితులను హాజరుపరిచి ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ మేరకు ఇద్దరు నిందితులైన షారుక్, ది ల్షాన్లను అరెస్టు చేసి జడ్చర్ల కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. మరో నిందితుడు అబ్దుల్ సత్తార్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. అ తడిని కూడా త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు వివరించా రు. చోరీ కేసును త్వరగా ఛేదించిన జడ్చర్ల పోలీసులను ఎస్పీ అభినందించి వా రికి రివార్డులను అందజేశారు. సమావేశంలో జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, రూరల్ సీఐ నాగార్జునగౌడ్, ఎస్సై శివానందం తదితరులు ఉన్నారు.