పౌరుషానికి ప్రతీక పాపన్నగౌడ్
పౌరుషానికి ప్రతీక సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌లో పాత ఆర్అండ్బీ అతిథిగృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆరాధ్యుడు సర్ధార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, మాజీ ఎం పీ మధుయాష్కీ, స్వామిగౌడ్‌తో కలిసి మంత్రి జూపల్లి హాజరై ఆవిష్కరించారు.
- ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి
- గౌడ కులస్తుల సంక్షేమాభివృద్ధికి కృషి : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- నాగర్‌కర్నూల్‌లో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
- హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నాగర్‌కర్నూల్, జూలై 22 : పౌరుషానికి ప్రతీక సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌లో పాత ఆర్అండ్బీ అతిథిగృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆరాధ్యుడు సర్ధార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, మాజీ ఎం పీ మధుయాష్కీ, స్వామిగౌడ్‌తో కలిసి మంత్రి జూపల్లి హాజరై ఆవిష్కరించారు. అనంతరం స్థానిక సాయిగార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ పాపన్నను గౌడ్‌ను సమాజం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కల్లుగీత కార్మిక వృత్తిలో ఉన్న ఇబ్బందులు తనకు తెలుసునని, కార్మికుల సంక్షేమం, రక్షణకోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి ఈత చెట్టు ఎక్కి కల్లు సేకరించే కార్మికుల కోసం సేఫ్టీ కిట్లను అందిస్తున్నారని వివరించారు.
గౌడల సంక్షేమానికి పాటుపడుతాం : శ్రీనివాస్‌గౌడ్
తాను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో గౌడ కు లస్తుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశానని మాజీ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మద్యం దుకాణాల్లో వీరికి 15 శాతం దుకాణాల కేటాయింపు, కోటీ 20 లక్షల ఈత, తాటి చెట్ల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలను అందించామన్నారు. తాను ఐదేండ్లు మంత్రిగా ఉండి గీత కార్మికుల వృ త్తిపై చీమ వాలనివ్వలేదన్నారు. పాపన్నగౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై స్వర్గీయ వెంకటస్వామి విగ్రహం పక్కన ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లిని కోరారు. 32 కోటలను జ యించి 24 చెరువులను తవ్వించిన గొ ప్పధీరుడు పాపన్న అన్నారు.
చరిత్రలో ఆయన పేరు రాకుండా కొందరు కుట్ర పన్నారని, శివాజీ మహారాజ్‌కు తీసిపోని విధంగా కోటలను స్వాధీనం చే సుకొని రాజుల పాలనను అంతమొందించి తాను రాజుగా ఈ ప్రాంతాలను పాలించారని గుర్తు చేశారు. అనంతరం స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంక న్న, దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ మాట్లాడుతూ పాపన్న చరిత్రను ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని, స మాజంలోని అన్ని వర్గాలను కలుపుకొ ని పోరాడిన గొప్ప మహనీయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజుగౌడ్, జి ల్లా అధ్యక్షుడు మల్లయ్యగౌడ్, సూర్యప్రతాప్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్, చైర్మన్ ఆనంద్‌గౌడ్, సీనియర్ జర్నలిస్టు కొండల్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే వంగా మోహన్‌గౌడ్, వంగా ఫకీరయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ బాలగౌడ్, వంగ లక్ష్మణ్‌గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజన్, గౌడ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

