Laxma Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Laxma Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు .
మహబూబ్ నగర్ : ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ( Laxma Reddy ) డిమాండ్ చేశారు . జిల్లా కేంద్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల దీక్షకు మాజీ మంత్రులు డా.సి.లక్ష్మారెడ్డి ,శ్రీనివాస్ గౌడ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి.ఇక మిగిలింది 2 సంవత్సరాలే. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్‌హెచ్‌ఎంలు అందించిన సహకారం మరవలేనిదని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సేవలు అందటం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెంచడానికి యన్ హెచ్ యం ఉద్యోగుల కృషి అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్హెచ్ఎంలకు న్యాయం చేయాలని కోరారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

