ధన్వాడ, అక్టోబర్ 16 : బెంగళూర్‌లో 13వ అంతర్జాతీయ స్థాయి బాలికల ఏషియన్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీ లు ఈనెల 17 నుంచి 27వ తేదీ వరకు కోరమాండల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. పోటీలకు ధన్వాడకు చెందిన పీఈటీ రామ్మోహన్‌గౌడ్ ఏషియల్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ టెక్నికల్ అధికారిగా నియమితులయ్యారు.
ఎంపికకు సహకరించిన రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, కోశాధికారి సో హెల్ రహెమాన్ ఖాన్, కార్యదర్శి ఖాజీ, కొం డాపూర్ గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజరాంలకు రామ్మోహన్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.