మూసాపేట, మార్చి 3 : దేశంలోనే అతిపురాతన క ళా సంపద ఉన్న ఆలయాల్లో మూసాపేట రామలింగేశ్వరస్వామి ఆలయం ఒకటి. శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణుడితో నివాసం ఉన్న ఘన చరిత్ర ఆలయానికి ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచే ఇం డియా సంస్థ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి తెలిపారు. ఆ లయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఆయన ఆదివారం మూసాపేటలోని రామస్వామి గు ట్టపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొండపై ఉన్న ఆలయం వద్ద ప్రత్యేకంగా శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుల గృహాలు ఉన్నట్లు, స్వామి వారు ఆ కొండపైకి వచ్చి కొంతకాలం ఉన్న ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించారు.
ఇక్కడ స్వ యంగా శ్రీరాముడే శివలింగం ప్రతిష్ఠించినట్లు తెలిపా రు. రాతిబండలపై శ్రీరాముడు చెక్కిన శిల్పకళలు ఉన్న ట్లు గుర్తించారు. శివాలయంతోపాటు వీరభద్ర ఆల యం, సరస్వతీ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయంతోపాటు రాతి బండలపై చెక్కిన అతీ పురాతనమైన కిరీటంలేని వినాయకుడు, చెన్నకేశవస్వామి విగ్రహం, శిలాయుగం నాటి ఎద్దు బొమ్మలు, శిలాతోరణం, క్రీస్తుపూర్వం 1076 నాటి కన్నడ శాసనం, ఆలయంలో రా తియు గం, మధ్యయుగం, కాకతీయులు, చోళులు నా టి శిల్ప కళలు ఉన్నట్లు చెప్పారు. 4వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఆలయంలో వివిధ కట్టడాలు, శిల్ప కళలు ఉన్నాయి చెప్పారు.
కానీ ఆలయం శిథిలమైపోయిందని చెప్పారు. అయితే ఆలయ పునఃనిర్మా ణం చేయాలని కమిటీ సభ్యులు, మండల కేంద్రంతో పాటు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నిర్ణయించిన అతి తక్కువ కాలంలోనే చాలా మంది ఆలయ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వస్తుండడం సంతోషకరమైన విషయమన్నారు. ఆలయ పునఃనిర్మాణానికి అ వసరమైన ప్లాన్ను తాను తయారు చేసి ఇస్తానని చెప్పా రు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అస్కని నరేందర్తోపాటు గ్రామపెద్దలు, వేముల, తుంకినీపూర్, నిజాలాపూర్, సంకలమద్ది తదితర గ్రామాలకు చెందిన యువకులు ఉన్నారు.