మరికల్ : మరికల్ మండలంలోని రా కొండ గ్రామంలో అక్రమంగా నిలువచేసిన రేషన్ బియ్యాన్ని ( Ration rice ) మరికల్ పోలీసులు పట్టుకున్నారు. ఎరుకలి పెద్ద మొగిలి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో మరికల్ పోలీసులు( Marikal Police ) అతడి ఇంటిపై దాడులు చేశారు. ఇంట్లో నిలువ ఉంచిన 9.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని మరికల్ ఎస్సై రాము( SI Ramu ) తెలిపారు. ఎరుకలి పెద్ద మొగిలి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.