కొత్తకోట : భారత్ పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి వీరోచిత పోరాటం చేస్తున్న ఆర్మీ జవాన్లకు ( Army Jawans ) సంఘీ భావంగా కొత్తకోట పట్టణ కేంద్రంలో శనివారం మార్నింగ్ వాకింగ్ క్లబ్ ల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ ( Peace Rally) నిర్వహించారు. పాక్ ఎదురు కాల్పులతో వీర మరణం పొందిన మురళీ నాయక్‌కు( Murali Naik ) నివాళి అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం పట్టణంలోని పుర వీధుల గుండా దాదాపు 200 బైక్ లతో భారత్ మాతాకి జై , వందేమాతరం అంటూ నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వాకింగ్ గ్రూప్ సభ్యులు వాకింగ్ వారియర్స్ వామన్ గౌడ్ బృందం , ఆరోగ్య క్లబ్ శేఖర్ గౌడ్ బృందం , వందే మాతరం క్లబ్ దేవన్న బృందం , ఛత్రపతి క్లబ్ స్టార్ ఆంజనేయులు బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు .