అయిజ, సెప్టెంబర్ 4 : మండలంలోని పలు గ్రామా ల్లో మంగళవారం రాత్రి ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అయిజ-ఎమ్మిగనూ ర్ రహదారిలోని పోలోని వాగు పొంగి ప్రవహించడంతో అంతర్రాష్ట్ర రహదారి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గమైన ఉత్తనూర్ మీదుగా ఎమ్మిగనూర్‌కు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎగువన భారీవర్షం కురవడంతో బింగిదొడ్డి చెరువు అలుగు పారడంతో అయిజ పట్టణంలోని పెద్దవాగుపై ఉన్న కాజ్‌వేపై వరద ప్రవహిస్తోంది. అయిజలోని మడ్డిగుంతకాలనీ, గాజులపేట, భరత్‌నగర్, దుర్గానగర్ తదితర కాలనీలు జలమయమయ్యాయి. అధికారులు లోతట్టు కాలనీల్లో పర్యటిం చి సహాయక చర్యలు చేపట్టారు.
వడ్డేపల్లి, సెప్టెంబర్ 4 : నాలుగైదు రోజులుగా కురుస్తు న్న వర్షాలతో జూలేకల్ సమీపంలో ఉన్న వాగు ఉధృతం గా ప్రహహిస్తున్నది. దీంతో జూలేకల్, జక్కిరెడ్డిపల్లె, కుర్వపల్లె, తిమ్మాజిపల్లె, శనగపల్లె, బుడ్డారెడ్డిపల్ల్లె గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు, ప్ర జాప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని ప్రజ లు, వాహనదారులు కోరుతున్నారు.