మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 12 : చేజారిన అవకాశం మళ్లీ తిరిగిరాదు.. మనలోని శక్తి సామర్థ్యాలను ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయకుం డా సాధించాలనే సంకల్పబలంతోనే ముం దుకు సాగాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. పీయూలో జరుగుతున్న టీజీ పీఈ సెట్ ఎంపికలకు గురువారం ముఖ్యఅతిథులు గా ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు పు రుషోత్తం, శ్రీరామ్ వెంకటేశ్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు పరుగు పందెం పోటీలను గాల్లోకి కాల్పులు జరిపి ప్రారంభించారు.
తెలంగాణలో వ్యాయామ ఉపాధ్యాయ విద్య ప్రవేశ పరీక్ష (టీజీ పీఈ-సెట్ 2025)లో భాగంగా పాలమూరు యూనివర్సిటీలో అభ్యర్థుల సామర్థ్యాల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే అభ్యర్థులకు పరుగు పందెం, షాట్‌ఫుట్, లాంగ్‌జంప్, హైజంప్‌తో అభ్యర్థి అభీష్టం మేరకు వారు ఎంచుకున్న ఆటలు క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, తదితర గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో పీయూ వైస్‌చాన్స్‌లర్ మాట్లాడారు. మొదటి, రెండో రోజు చాలా చక్కగా పారదర్శకంగా ఎంపికలు జరిగాయన్నారు. ఈ సెట్ నిర్వహణ బాధ్యతను అప్పగించిన తెలంగాణ ఉన్నత విద్యామండలికి ధన్యవాదములు తెలిపారు.
ఒక అభ్యర్థికి ఛాతిలో నొప్పి వచ్చినట్లు తెలపడంతో ప్రథమ చి కిత్స అనంతరం ఆయనను వెంటనే అంబులెన్స్‌లో మెరుగైన వైద్య సేవలకు జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. రెండోరోజు బీపెడ్లో 544 మంది విద్యార్థులకు గానూ 370 మంది విద్యార్థులు హాజరయ్యారు. డీపెడ్ కోర్సులో 231 మంది విద్యార్థులకు గానూ 145 మంది విద్యార్థులు హాజరయ్యారని సెట్ కన్వీనర్ దిలీప్, పీయూ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమాల్లో పీయూ రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, పీయూ పీఆర్వో శేకుంటి రవికుమార్, అ ధ్యాపకులు జ్ఞానేశ్వర్, వెంకటేశ్‌యాదవ్, అర్జున్‌కుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.