మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 24 : ఏషియన్ నెట్‌బాల్ పోటీల్లో సత్తాచాటాలని ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఏషియన్ నెట్‌బాల్ పోటీలకు ఆదివారం మొదటి దఫా ఎంపికలు నిర్వహించినట్లు నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు, కార్యదర్శి విక్రమాదిత్యరెడ్డి, ఖాజాఖాన్ తెలిపారు.
వివిధ రాష్ర్టాల నుంచి మహిళలు, పురుషుల 125మంది క్రీడాకారులు ఎంపిక కాగా.. వీరికి జనవరిలో శిక్షణ నిర్వహిస్తామన్నారు. అనంతరం కొరియా, దేశంలోని న్యూఢిల్లీలో జరిగే ఏషియన్ నెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, దేశ నెట్‌బాల్ సమాఖ్య అబ్జర్వర్ గాడ్సన్బాబు, నెట్‌బాల్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేశ్‌కుమార్, సునిల్, కురుమూర్తిగౌడ్, రామ్మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.