ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యం
కాంగ్రెస్ ఎన్నికలకు ముం దు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమని, ఇది తెలిసే టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం అప్పాయపల్లిలో ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న మహబూబ్‌నగర్ మండల పరిషత్ సభ్యులను మంగళవారం సన్మానించారు.
- చేతగాకే కాంగ్రెస్ కాలయాపన
- పదవులు కాదు చేసిన పనులే శాశ్వతం..
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు, జూలై 9 : కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమని, ఇది తెలిసే టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం అప్పాయపల్లిలో ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న మహబూబ్‌నగర్ మండల పరిషత్ సభ్యులను మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. పదేండ్లు తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నదన్నారు. ప్రజలు ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం చెప్తారన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి పాలన చేతగాక కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సర్కారులో పార్టీలకతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడ్డామన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలబడ్డామని చెప్పారు. మన్యంకొండ ఆలయా న్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. అధికారం లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, తాజా మాజీ ఎంపీపీ సుధాశ్రీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు, అల్లావుద్దీన్, శ్రీకాంత్‌గౌడ్, రాఘవేందర్‌గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

