సమయపాలన గాలికి..! మండల సర్వసభ్య సమావేశంపై అధికారుల నిర్లక్ష్యం
నారాయణపేట జిల్లా మాగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించాల్సిన సర్వసభ్యపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.
మాగనూరు నవంబర్ 13: నారాయణపేట జిల్లా మాగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించాల్సిన సర్వసభ్యపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11:30 గంటలు దాటినా ప్రారంభం కాకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి కీలక అంశాలపై చర్చించాల్సిన సమావేశం పట్ల అధికారులే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజా సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సర్వసభ్య సమావేశం అంటే ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు అన్వేషించే వేదిక. అలాంటి కీలక సమావేశానికి సమయపాలన పాటించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. మరోవైపు సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులకు వివిధ శాఖల నుంచి అందించాల్సిన నివేదికలను కూడా నామమాత్రంగా అందజేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి పురోగతి, ఖర్చులు, పెండింగ్ సమస్యలపై సమగ్ర వివరాలు అందించాల్సి ఉండగా, కేవలం మొక్కుబడిగా నివేదికలు అందజేయడం ఎంతవరకు సమంజసమని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాప్రతినిధులకు సరైన సమాచారం అందించకుండా, సమావేశాన్ని సకాలంలో ప్రారంభించకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల పాత్రను తక్కువ చేసి చూసినట్లుగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సర్వసభ్య సమావేశాల నిర్వహణలో సమయపాలన పాటించేలా, అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సర్వసభ్య సమావేశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలుగా కాకుండా కేవలం తూతూమంత్రపు సమావేశాలుగానే మిగిలిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య
ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన.. మద్దతు తెలిపిన హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

