Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య
Warangal | కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా కరెంటు సరఫరా చేయక, సరిపడా నీళ్లు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.
Warangal | కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా కరెంటు సరఫరా చేయక, సరిపడా నీళ్లు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడటం పరిస్థితికి అద్దం పడుతున్నది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుజ్జు తండాలో జర్పుల వెంకటేష్ (27) అనే రైతు తనకున్న రెండెకరాల భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాకపోవడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో పత్తి సాగులో నష్టం రావడంతో మెట్ల ఉప్పలమ్మ (50) అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండా పరిధిలోని వెంకట్రామ్ తండాలో తనకున్న రెండెకరాల భూమిలో వరి, మొక్కజొన్న సాగు చేయగా, ఆశించిన దిగుబడి రాక అప్పులు పెరగడంతో బానోతు రాములు (58) అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన.. మద్దతు తెలిపిన హరీశ్ రావు
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’ ట్రైలర్ విడుదల.. లాయర్‌గా అదరగొట్టిన బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

