మూడేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు.. వాకిటి శ్రీహరికి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నల వర్షం
మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. ముంపు గ్రామాల సమస్యలపై ప్రశ్నించిన ఆయన.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేరడగంలో సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
మాగనూరు, సెప్టెంబర్ 2: మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. మూడేళ్లుగా మంత్రిగా కొనసాగుతున్నా ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
మాగనూరు మండలం నేరడగం గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మతో పాటు కాంగ్రెస్‌కు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు 50 మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని బీఆర్ఎస్కు మద్దతుగా నినాదాలు చేశారు.
“నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?”
నేరడగం, బూత్పూర్ గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తిస్తూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీవో తీసుకొచ్చానని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ‘‘నేను జీవో తెచ్చా.. మూడేళ్లలో మీరు ఏం చేశారు?’’ అంటూ మంత్రిని ప్రశ్నించారు. ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
ఆరు గ్యారంటీలపై వెనక్కి తగ్గేది లేదు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Chittem Rammohan Reddy1
అధికార పార్టీకి నేరడగంలో ఎదురుదెబ్బ
మంత్రి సొంత నియోజకవర్గంలో నేరడగం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మ, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన, వార్డు నెంబర్లు, ఉట్కూరు అశోక్,కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీని వీడి ప్రతిపక్ష బీఆర్ఎస్లో చేరుతున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తాను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. “ప్రజల సమస్యలపై పోరాడేవారికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. అధికారంలో ఉన్నా ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తాం. హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదు” అని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాగనూరు మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, రఘు, లక్ష్మణ్, నర్సింలు, గాల్‌రెడ్డి, నరసింహగౌడ్, మల్రెడ్డి ఈశ్వర్ యాదవ్, ఉప్పర్ రవి, జమీల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

