నాగర్‌కర్నూల్ : మంత్రి కేటీఆర్‌కు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ వివరాలను నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అందజేశారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని గ్రామ కమిటీలు, మండల కమిటీల సమగ్ర సమాచారాన్ని కేటీఆర్‌కు అందజేశారు. నియోజకవర్గంలో పార్టీ పురోభివృద్ధిపై మంత్రికి వివరించారు.