Teacher Misbehave | నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థుల తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇంగ్లీష్ పాఠాలను బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని టీచర్ పవన్‌పై దాడి చేసినట్లు తెలుస్తుంది.
టీచర్ ఇదే పాఠశాలలో 8,9,10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఇంగ్లీష్ క్లాసులను బోధించేవాడు. పాఠాలను బోధించేటప్పుడు పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినప్పుడు విద్యార్థినులను అసభ్యంగా తాకుతూ భుజాల మీద చేతులు వేసి ఇష్టానుసారంగా వ్యవహరించేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సదరు టీచర్ విద్యార్థినులను తనను బావ, మామ అని వరుసలు పెట్టి పిలవాలని హుకుం జారీ చేసినట్లు వాళ్లు తల్లిదండ్రులతో మొర పెట్టుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
టీచర్ వేధింపులు ఎక్కువ అవడంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు యువకులు పాఠశాలకు చేరుకుని టీచర్ పవన్‌కి దేహశుద్ధి చేసినట్టు సమాచారం. అనంతరం టీచర్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనపై ఎంఈఓ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాఠశాలకు వచ్చిన ఎంఈఓ విద్యార్థినులతో రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకొని విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై గతంలోనే ఎంఈఓ శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇస్తే పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
KTR | 21న జాతీయ రహదారుల దిగ్బంధం.. భారీగా తరలిరావాలని అన్నదాతలకు కేటీఆర్ పిలుపు
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి