Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Farmers | రేవంత్ ప్రభుత్వంలో తెలంగాణలో వాటర్ వార్ ఎలా ఉందో తెలియజేసే వీడియో ఒకటి బయటకు వచ్చింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో సాగునీటి కోసం రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Irrigation | కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతన్నలు సాగు నీటి కోసం, కరెంట్ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో తెలియజేస్తూ దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ రోజు వెలుగులోకి వస్తున్నాయని తెలిసిందే. ఇప్పటికే సాగునీరు విడుదల చేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు, మరోవైపు కరెంట్ కోతలకు నిరసనగా సబ్ స్టేషన్లను కూడా ముట్టడిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వంలో తెలంగాణలో వాటర్ వార్ ఎలా ఉందో తెలియజేసే వీడియో ఒకటి బయటకు వచ్చింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో సాగునీటి కోసం రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలో ప్రవహిస్తున్న బీమా కాల్వకు జూరాల ప్రాజెక్టు ద్వారా నీరు ప్రవహిస్తుండగా, ఆ నీటి పంపిణీకి సంబంధించి మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతులు గొడవకు దిగారు. మొదట ఓ రైతును మరో రైతు కిందికి తోసేయగా.. ఆ గొడవ కొద్దికొద్దీగా పెరిగి రెండు గ్రామాల రైతుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఘటనా స్థలానికి పోలీసులు రైతులను వారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ,, రెండు గ్రామాల రైతులు పోలీసుల ముందే పిడి గుద్దులు గుద్దుకుంటూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణలో వాటర్ వార్స్ మొదలు
కొల్లాపూర్ నియోజకవర్గంలో సాగునీటి కోసం రెండు గ్రామాల మధ్య ఘర్షణ
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలో ప్రవహిస్తున్న బీమా కాల్వకు జూరాల ప్రాజెక్టు ద్వారా నీరు ప్రవహిస్తుండగా, ఆ నీటి పంపిణీ వ్యవహారంలో గొడవకు దిగిన మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతులు
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నా, వారి ముందే పిడి గుద్దులు గుద్దుకుంటూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన రైతులు
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2026
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

