అమరచింత : ఇటీవల నిర్వహించిన సివిల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ర్యాంక్‌ను (Civil Ranker) సాధించిన అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్ రెడ్డిని ( Suryaprakash Reddy ) మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ( MLA Vakiti Srihari ) సన్మానించారు . సివిల్ ప్రవేశపరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంక్, జాతీయస్థాయిలో 497 మార్కులు సాధించినందుకుగాను శనివారం సివిల్స్ ర్యాంకర్ సూర్యప్రకాశ్ రెడ్డిని పూలమాల , శాలువాతో సన్మానించారు.
ఈర్లదిన్నె గ్రామంలో నివాసం ఉంటున్న వసంత రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ రెడ్డి హైదరాబాదులోని వీఎన్ఆర్ కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసి ప్రభుత్వం నిర్వహించిన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభను చాటాడు. ఈ కార్యక్రమంలో పీర్లదిన్నె సర్పంచ్ చుక్క రామలక్ష్మమ్మ, డీసీసీబీ మాజీ డైరెక్టర్ చుక్క ఆశ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బూసిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.