ప్రతిఎకరాకూ సాగునీరందిస్తాం
జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐఎస్)భాగమైన గుడిపల్లి గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఆయకట్టులోని మోటర్లకు బుధవారం ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, కలెక్టర్ సంతోష్‌తో కలిసి మంత్రి జూపల్లి పూజలు చేసి నీటిని విడుదల చేశారు.
- ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు
- ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐఎస్)భాగమైన గుడిపల్లి గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఆయకట్టులోని మోటర్లకు బుధవారం ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, కలెక్టర్ సంతోష్‌తో కలిసి మంత్రి జూపల్లి పూజలు చేసి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్వకుర్తి ప్రాజెక్ట్ పరిధిలోని 3.65 లక్షల ఎకరాల ఆయకట్టులో మూడింట రెండు వంతులకు పైగా గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి నీరు అందుతుందన్నారు. రిజర్వాయర్ నుంచి నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేయ డం జరిగిందన్నారు. పంపుల ద్వారా ప్రతిరోజూ 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నా రు. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గం రైతులకు వానదేవుడి దయతో రెండు పంటలకు సాగునీరు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి ఇటీవలే ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్‌ల సమీక్షా సమావేశంలో పనుల పురోగతిపై వేగవంతం చేసేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లాల ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. అనంతరం కృష్ణమ్మకు పూలతో స్వాగతం పలికారు. అంతకు ముందు ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి సమావేశమై నీటి లభ్యత, విద్యుత్ వినియోగం తదితర అం శాలపై కూలంకుషంగా చర్చించారు. కార్యక్రమంలో ఇం జినీరింగ్ అధికారులు సత్యనారాయణరెడ్డి, ఈఈ రవీందర్, ఎస్వీఎన్ కంపెనీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

