పాలమూరు, ఫిబ్రవరి 11 : పేదల తిరుపతిగా పేరొందిన మన్యంకొండకు భక్తులు పోటెత్తారు. లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలు, ఆటోలు, బస్సుల్లో వేలాదిగా స్వామి సన్నిధికి చేరారు. కోనేరులో పుణ్యస్నానా లు ఆచరించారు. కొందరు తలనీలాలు సమర్పించారు. కొత్త కుండల్లో స్వామికి నై వేద్యం సిద్ధం చేసి సమర్పించారు. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
గంటల కొ ద్దీ బారులుదీరి స్వామిని దర్శించుకొని తన్మయత్వం చెందారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సుప్రభాతసేవతో ప్రారంభించి స్వామికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రా త్రికి శేషవాహన సేవను వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు. ఆలయ పరిసరాలు, జాతర ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. మిఠాయి, చిన్నారుల ఆటవస్తువులు, గాజుల దుకాణాల వద్ద సందడి నెలకొన్నది. వై ద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, ఆలయ ఈవో శ్రీనివాసరాజు, పర్యవేక్షకులు నిత్యానందాచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు