కొల్లాపూర్ : మామిడి రైతులకు మామిడికాయలకు కట్టుకునే కవర్లను సింగిల్ మాజీ విండో చైర్మన్ జూపల్లి రఘుపతిరావు( Rghupati Rao) పంపిణీ చేశారు. సోమవారం మండలంలోని కుడికిల్ల రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు చేశారు. మామిడి మొక్క నుంచి పూత వరకు కాయ ఏ దశలో వస్తుందని రైతులు గమనించాలన్నారు.
మొక్కలకు అధిక మొత్తంలో మందులను వాడితే దిగుబడి (Mango yield) తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బయట దొరికే కల్తీ మందులను వాడకుండా అగ్రికల్చర్ అధికారులను సంప్రదించి సస్యరక్షణ చర్యలు చేపడితే రైతులు లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన , పట్టు పరిశ్రమ అధికారి ఎం వెంకటేశం, తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లాయక్ అహ్మద్ , ప్రసాద్ సీడ్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ హెడ్ విజయ భాస్కర్ రెడ్డి, భూపేష్ , కెవికెపాలెం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్ కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన అధికారి ఎం లక్ష్మణ్ , రైతులు పాల్గొన్నారు.