
మహబూబ్‌నగర్: ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు సైతం ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపా ధ్యాయులకు అండగా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగా ణ ఉద్యమంలో జరిగిన పలు అంశాలను ఉపాధ్యాయులతో పంచుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డిలకు జ్ఞాపికలను అందజేస్తూ శాలువ, పూలమాలాలతో ఘనంగా సన్మానించారు. పీఆర్టీయూ సంఘం నేత లు రఘురాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, అశ్వినీ, తదితరులు పాల్గొన్నారు.