
మహబూబ్‌నగర్: ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించి దేశ భవిష్యత్తుకు అవసరమైన భావితరాల ప్రయోజకులను తయా రు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పద్మావతి కాలనీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విద్యాభివృద్ధి వేదిక ప్రారంభోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు.
నూతన అలోచనలతో విద్యాభివృద్ధికి కృషి చేసే ఉపాధ్యాయులకు సహాయ సహకరాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపా రు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ స్వర్ణారెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, సంఘం నేతలు హేమచంద్రుడు ఉన్నారు.