నవాబ్‌పేట, మే 13 : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ యాదిరెడ్డి ఆశయసాధనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నవాబ్‌పేట మండలం రుద్రా రం గ్రామశివారులోని వ్యవసాయక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన యాదిరెడ్డి మొ దటి వర్ధంతి సభకు ఎంపీ ముఖ్యఅతిథిగా హా జరయ్యారు. ముందుగా యాదిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, రైతుబంధు సమితి మం డల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య, సర్పంచ్ గోపాల్‌గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, సంజీవరెడ్డి, లక్ష్మయ్య, కృష్ణగౌడ్, పాశం కృష్ణయ్య, భోజయ్యచారి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.