జడ్చర్ల/జడ్చర్లటౌన్, మే 11 : పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం వాసవీమాత జయంతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవోపా ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన తదితర పూజలు చేశారు. సాయంత్రం డోలారోహణం, మహామంగళహారతి, పల్లకీసేవ ని ర్వహించారు. వాసవీమాత జయంతి ఉత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాదేపల్లి మార్కెట్‌యార్డును పరిశీలించారు. హ మాలీలకు విశ్రాంతి గది, త్రీవీల్ ఆటో యూనియన్ గది నిర్మాణం, ఆటోపార్కింగ్ కోసం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి, రామ్మోహన్, మధు, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, అవోపా అధ్యక్షుడు గంధం రవి, మురళీకృష్ణ, శివ్వ తిరుపతయ్య, మెడిశెట్టి రామకృష్ణ, కొట్రమధు, దాచేపల్లి చంద్రయ్య, హైమావతి, రేఖ, జ్యో తి, శ్రీలత, చందు తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, మే 11 : మండలకేంద్రంలో వాసవీమాత జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ మండల అధ్యక్షుడు అనంతయ్యగుప్తా ఆధ్వర్యంలో వాసవీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నర్సింహారావు, శ్రీనివాసులు, విజయ్‌కుమార్, సత్యనారాయణ, వెంకటయ్య, నర్సింహులు, ప్రకాశ్, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.