ఊట్కూర్, మే 11 : మండలకేంద్రంలో వాసవీమాత జయంతిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘ నంగా నిర్వహించారు. అమ్మవారికి మంగళ హారతి, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రా మంలో మొట్టమొదటి సారి నిర్వహించిన అమ్మవారి జ యంతిని పరిసర గ్రామాల నుంచి ఆర్యవైశ్య సోదరులు, భ క్తులు పెద్దసంఖ్యలో హాజరు కాగా కమిటీ ఆధ్వర్యంలో అ న్నదానం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు సుదేంద్రశెట్టి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించా రు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు సుధాకర్, కిష్టయ్య, తిమ్మయ్య, సుర్యనారాయణ, శంకర్, దత్తన్న, సుభాశ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
జల్దిబిందెలతో ఊరేగింపు
మరికల్, మే 11 : వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలను బుధవారం మండలకేంద్రంలో ఆర్యవైశ్య సం ఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి ఈశ్వరాలయం వరకు జల్దిబిందెలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యే క పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు సుదేంద్రశెట్టి అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు రమేశ్, నాగరాజు, శేషాద్రి, రాంబాబు, శ్రీనివాసులు, సింహాచలం, శివ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో…
దామరగిద్ద, మే 11 : మండలకేంద్రంలోని కాన్యకా పరిమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు సు వర్ణమ్మ, శెట్టి శ్రీదేవి, టీబీవీ రమణ, కోస్గి చంద్రశేఖర్, శెట్టి శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో…
కృష్ణ, మే 11 : మండలంలోని గుడెబల్లూర్, హిందుపూర్ గ్రామాల్లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం కన్యకా పరమేశ్వరి(వాసవీ)మాత జయంతిని ఘ నంగా నిర్వహించారు. లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వాసవీమా త చిత్రపటానికి పూలమాల వేసి పట్టువస్ర్తా లు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మ హిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన జరుపుకొన్నారు. అనంతరం భక్తులకు అన్నదా న కార్యక్రమం నిర్వహించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
మక్తల్ టౌన్, మే 11 : పట్టణంలో వా సవీమాత జయంతిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి సందర్భంగా సుప్రభాతం, 108 కళశాలతో పురవీధుల గుం డా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, డోలారోహణం, రథోత్సవం, మహామంగళ హారతితో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో చైర్మన్ కొత్త శ్రీనివాస్‌గుప్తా, అధ్యక్షుడు సురేశ్, భాస్కర్, వెంకటేశ్, నాగరాజు, రతన్, జగదీశ్, రంజి త్, రంగనాథ్, అశ్విని, మేఘన, పద్మ, దేవి, మీరాబాయి, శారద, ఉషారాణి, వెం కటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
కన్యకాపరమేశ్వరి ఆలయంలో..
నారాయణపేట టౌన్, మే 11 : పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతిని ఆర్యవైశ్య సం ఘం ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకం, డోలారోహణం, ఒడిబియ్యం, శ్రీసూక్త హోమా లు, పల్లకీ సేవ తదితర పూజా కార్యక్రమా లు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంజనేయస్వామి ఆలయంలో..
మక్తల్ రూరల్, మే 11 : మండలంలోని జక్లేర్ ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం వాసవీమాత జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర శెట్టి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అ మ్మవారికి అభిషేకం, అలంకరణ చేశారు. అలాగే భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమం లో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి వెంకటేశ్, మహిళా సంఘం అధ్యక్షురాలు మీరాబా యి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.