మక్తల్ టౌన్, డిసెంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కో -ఆపరేటివ్ సొసైటీ వినియోగం పెరిగింది. రైతులకు లాభసాటిగా సలహాలు, సూచనలు అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏ ర్పాటు చేశారు. అభివృద్ధి పర్చి ఈ సంఘాల నుంచి రైతులు మరింత మెరుగుపడే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ది. కో -ఆపరేటివ్ సొసైటీలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం సేవలు, విస్తీర్ణం పెరిగింది. దీంతో ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి సహాయంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చిట్యాల నిజాంపాషా కృషి ఫలితంగా, మక్తల్ సీఎంఎస్ భవనం అందమైన కార్యాలయంగా రూపుదాల్చుకొని సేవలు కొనసాగుతాయి.
సహకార సంఘం పేరిటా భవన సముదాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు సీఎంఎస్ సెంటర్కు సంబంధించిన భవన సముదాయాన్ని వేరే శాఖ ఉపయోగించేది. అయితే ఈ భవన సముదాయల్లో ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టలేదు. ఆ శాఖ భవనాన్ని ఖాళీ చేసి వె ళ్లారు. మక్తల్ కో ఆపరేటివ్ శాఖకు సంబంధించిన సముదాయాన్ని రూ.3 లక్షల 20వేలు ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. దీంతో మక్తల్ కో ఆపరేటివ్ పేరును ధరణి పోర్టల్లో నమోదు చేయడం జరిగింది. ఈ స్థలం సీఎంఎస్ మ క్తల్ శాఖ పరిధిలోకి వచ్చింది.
అభివృద్ధి ఇలా…
కో ఆపరేటివ్ సొసైటీతో రూ.38 లక్షల రుణం పొంది సీఎంఎస్ సెంటర్ను అన్ని హంగుల్లో అభివృద్ధి పర్చి రైతు లు, వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సహకార సంఘం పరిధి విస్తరించడంతో విశాలవంతమైన కార్యాలయ సముదాయం ఏర్పాటు కావడంతో రైతులకు అన్ని రకాల వస్తువులను అందించేందుకు వీలుగా ఏర్పడింది.
త్వరలోనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తాం
మక్తల్ సీఎంఎస్ సెంట ర్ సముదాయంలో షాపిం గ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడు తాం. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సహాయ సహకారాల తో ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాం. కో ఆపరేటివ్ నిధులతో సీ ఎంఎస్ సెంటర్ను అందంగా తీర్చిదిద్ది, వినియోగంలోకి తీసుకొస్తాం.
– చిట్యాల నిజాంపాషా, డీసీఎంఎస్ చైర్మన్