నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 14: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల ప్రత్యే క కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వజ్రోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించి, నిర్వహణపై సూచనలు చేశారు.
వీసీలో పాల్గొన్న కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలోని మక్తల్, నారాయణపేట మున్సిపాలిటీల్లో ఒక్కో ము న్సిపాలిటీలో 15 వేల మందితో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. పేటలో ప్రభు త్వ డిగ్రీ కళాశాల నుంచి జీపీ శెట్టి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే సమావేశం నిర్వహించి, భోజనాలు ఏ ర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మక్తల్‌లో కాలేజీ మైదానం నుంచి ద్వారకా ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
17న పరేడ్ మైదానంలో జాతీయ పతాకం ఆవిష్కరణ, అదే రోజు జిల్లా నుంచి ప్రత్యేక బస్సుల్లో గిరిజన ప్రజాప్రతినిధు లు, ఉద్యోగులు, మహిళా సంఘా ల ప్రతినిధులను హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి తరలించేలా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బస్సులో ఎంపీడీవో, లైజనింగ్ ఆఫీసర్, పోలీస్ కానిస్టేబుల్‌ను ని యమిస్తామని, తాగునీరు, అల్పాహారం, భోజనాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 18న సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వీసీలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజారాణి, డీఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా 16న పట్టణంలో ర్యాలీ అనంతరం జీపీ శెట్టి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ హరిచందన ఫంక్షన్ హాల్‌ను పరిశీలించారు. ర్యాలీలో పాల్గొనేవారికి భోజన సదుపాయాల విషయం లో ఎలాంటి అవాంతరాలు జరుగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. భోజన సమయంలో సందడి లేకుండా అధికంగా టేబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తాగేందుకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజారాణి, డీఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో రాంచందర్‌నాయక్, తాసిల్దార్ దానయ్య పాల్గొన్నారు.