ఉండవెల్లి, ఆగస్టు 15 : కూలీలతో వెళ్తు న్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 16 మందికి గాయాలైన ఘటన గురువారం చోటు చే సుకున్నది. స్థానికు ల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా ఈ తాండ్రపాడు గ్రామానికి చెందిన 18 మంది కూలీలు ఉదయం 9 గంటలకు ఆటోలో ఉండవెల్లి మం డలం కంచుపాడులో మిరపపంట కలుపు తీసేందుకు జాతీయ రహదారి మీదుగా వస్తున్నారు. ఉండవెల్లి శివారు వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గరికి రాగానే ఐరన్ మట్టి లోడ్‌తో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది.
లారీ ఆటోను దాదాపు 200 మీటర్లు ఈడ్చుకొని పోవడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లక్ష్మీదేవి (56) అక్కడికక్కడే మృతి చెందగా రమాదేవి (40) క ర్నూల్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అనిత పరిస్థితి విషమం గా ఉన్నది. అదేవిధంగా పావని, లక్ష్మీదేవి, వరలక్ష్మి, టీ పావని, ప్రియాంక, కే వరలక్ష్మి, నందు, రాధ, లక్ష్మీదేవి, పద్మ, నర్సింహ(ఆటో డైవర్)తోపాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను 108, హైవే అంబులెన్స్‌లో కర్నూ ల్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు.