పాలమూరు, మే 18 : అంతర్జాతీయ ప్రమాణాలతో గుర్తింపు ఉన్న జూనియర్ కళాశాలగా ఐఎస్వో సంస్థ ద్వారా వాగ్దేవి జూనియర్ కళాశాల రాష్ట్రంలోనే మొట్టమొదటిదిగా నిలిచింది. ఈ సందర్భంగా సర్టిఫికెట్ (21001:2018)ను కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డికి ఐఎస్వో మేనేజింగ్ డైరెక్టర్ శివయ్య శనివారం అం దజేశారు. అనంతరం శివయ్య మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పూలబాట వేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న కళాశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపా రు. అనంతరం డీఐఈవో శ్రీధర్‌సుమన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాల తో గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. అదేవిధంగా విద్యావేత్త హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.విజయ్‌కుమార్, ఇంటర్మీడియెట్ జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ సందీప్‌రెడ్డి, సాధిక్, ప్రిన్సిపాల్ గీతాదేవి, ఐఐటీ ఇన్చార్జి పావనిరెడ్డి, ఎప్‌సెట్ ఇన్చార్జి షాకీర్, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతినందన్‌రెడ్డి, యాజమాన్య సభ్యులు శివకుమార్, నాగేందర్, రాఘవేంద్రరావు, మెగ్యానాయక్, నరేశ్, రఘువర్ధన్‌రెడ్డి, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.