గట్టు : రాబోయే రోజుల్లో విద్యాభివృద్ధిలో గట్టు ( Gattu ) మండలం ముందంజలో ఉండనున్నదని స్థానిక ఎస్సై కెటి మల్లేష్ (SI Mallesh ) ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం (బైపీసీ) లో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు( First Rank ) సాధించిన రాయపురం గ్రామానికి చెందిన లావణ్య( Lavanya ) తో పాటు ఆమె తల్లిని వారి స్వగృహంలో గురువారం సన్మానించారు.
ఈ సందర్భంగా చదువుల తల్లికి చేదోడుగా రూ. 5 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లావణ్యను ఆదర్శంగా తీసుకొని చదువులో రాణించాలని కోరారు. మండలానికి చెందిన విద్యార్థులు, యువకులు చదువులు, పోటీపరీక్షలో రాణిస్తూ విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతుండడం గొప్ప విషయం అన్నారు.
రానున్న రోజులో విద్యాభివృద్ధిలో గట్టు వెనుకబడిందని అపవాదు పూర్తిగా తొలగిపోనున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బుడ్డన్న, భీమేష్, మాజీ ఎంపీటీసీ రంగస్వామి, గ్రామస్థులు వెంకటేష్ , కర్రెప్ప, తాయప్ప, పాగుంటప్ప తదితరులు పాల్గొన్నారు.