గుండె జరభద్రం
ఇటీవలి కాలంలో చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు.
- యాంత్రిక జీవన విధానంలో పెరుగుతున్న గుండెపోట్లు
- మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లే కారణమంటున్న వైద్యులు
- నేడు ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవం
కోస్గి, సెప్టెంబర్ 28 : ఇటీవలి కాలంలో చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. అస్తవ్యస్తమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యసనాల వల్ల చాలా వరకు గుండెపోట్లు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజూ వ్యాయామం చేసేవారు, వాకింగ్ చేసే వారు సైతం ఇటీవల ఉన్నట్టుండి కుప్పకూలిపడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి 90లక్షల మంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ఆలోచించాల్సిన అవసరమున్నది. యంత్రంలా క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ మన ఉనికిని కాపాడుతున్న గుండె పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్లే చాలా వరకు గుండెపోట్లు వస్తున్నాయని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ గుండెను పదిలంగా చూసుకోవాల్సిన అవసరమున్నదని అంటున్నారు.
ఆహారపు అలవాట్లే గుండెకు హాని..
ఆధునిక యుగంలో శుద్ధి చేయకుండా అనేక ఆహార పదార్థాల అమ్మకాలు పెరిగాయి. యాంత్రిక జీవనంలో మనం కూడా వాటి పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నాం. అందమైన ప్యాకింగ్లతో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల్లో అవసరానికి మించిన పంచదార, ఉప్పు, నూనెలు, కొవ్వుపదార్థాలు ఉంటాయి. ఫాస్ట్‌ఫుడ్ తినడం గుండె సమస్యలకు ముఖ్య కారణం. కూల్‌డ్రింక్స్ బయట లభించే పండ్లరసాలు, వివిధ రకాల స్వీట్లు విపరీతంగా తీసుకోవడం గుండెకు ప్రమాదాలు తెచ్చి పెడుతున్నది.
గతంలో 40 ఏండ్ల తర్వాత అరుదుగా కన్పించే గుండెపోట్లు నేడు టీనేజ్లోనే వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 20 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయసు గల వారిలో ఎవరు ఎప్పుడు ఎక్కడ కుప్పకూలిపడిపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కనీస వ్యాయమం లేకపోవడం, పనిభారం, మరకద్రవ్యాలు సేవించడం, మద్యం అలవాట్లు, పొగ తాగడం వంటి చర్యలు గుండె పనితీరును మార్చివేస్తున్నాయి. మన చేతులారా మనమే గుండెకు అనేక చిక్కులు తెచ్చి పెడుతున్నాం.
డీజే సౌండ్లతో గుండెకు ప్రమాదం..
ఉత్సవాలు, సంబురాల పేరిట డీజే సౌండ్స్ స్థాయికి మించి శబ్ధ్దాల వల్ల గుండెపోటుకు ఒక రకంగా కారణమవుతున్నాయి. తాజాగా గణేశ్ ఉత్సవాల్లో జరిగిన నిమజ్జనంలో డీజే సాండ్ ధాటికి నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండంలం పాలెం గ్రామానికి చెందిన పానుగంటి మల్లేశ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

