మహబూబ్‌నగర్, జనవరి, 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, వనపర్తి కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు కలెక్టర్‌గా జగిత్యాల కలెక్టర్‌గా ఉన్న జి.రవి, వనపర్తి కలెక్టర్‌గా పాలమూరు అడిషినల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను నియమించారు. వనపర్తి కలెక్టర్‌గా ఉన్న షేక్ యాస్మిన్‌బాషాను కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు, పాలమూరు కలెక్టర్ వెంకట్రావును సూర్యాపేట జిల్లాకు బదిలీ చేశారు.