శ్రీరంగాపూర్, డిసెంబర్ 12 : చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని ఐజీ కమలహాసన్‌రెడ్డి హెచ్చరించారు. శ్రీరంగాపూర్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఐజీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్ కేసుల వివరాలు, లా అండ్ ఆర్డర్ నిర్వహణ, గతేడాది ఎన్ని కేసులు నమోదయ్యాయి..? ఎన్ని కేసుల్లో నిందితులకు శిక్ష పడింది..? వివరాలపై ఎస్సై మల్లేశ్‌తో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100కు కాల్ వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిష్కరించాలన్నారు. కేసులు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. అనంతరం రంగనాయకస్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. అంతకుముందు ఆలయ పూజారి విష్ణునారాయణ ఐజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్పీ అపూర్వరావు, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, కొత్తకోట సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్సై రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీపీవో కార్యాలయం తనిఖీ
గద్వాల, డిసెంబర్ 12 : అలంపూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఐజీ కమలహాసన్‌రెడ్డి తనిఖీ చేశారు. ఐజీకి ఎస్పీ రంజన్త్రన్‌కుమార్, డీఎస్పీ రంగస్వామి పూలబొకే అందజేశారు. జిల్లాకేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న డీపీవో, డీఎస్పీ, పట్టణ పోలీస్‌స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. అలాగే ఐజీని కలెక్టర్ వల్లూరు క్రాంతి కలిసి పూలమొక్క అందజేశారు.