మహబూబ్‌నగర్‌లో ఫిజియో థెరపీ కళాశాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింద ని, జనవరి నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఆంధ్ర మహిళాసభ ట్రస్టీ సభ్యుడు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావుతో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఫిజియోథెరపీ విద్యకు దేశ, విదేశాల్లో మంచి ఆదరణ ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద ఉన్న ఆంధ్ర మహిళా సభ సముదాయంలోనే కాలేజీ ఏర్పాటు చేస్తామని.., జనవరి నుంచి 50 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభిస్తామని వివరించారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లాలో ఫిజియోథెరపీ కళాశాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని, జనవరి నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఆంధ్ర మహిళా సభ ట్రస్టీ సభ్యుడు, మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావుతో కలిసి జెడ్పీ సమావేశ మందిరంలో మంత్రి విలేకరులతో మట్లాడారు. జిల్లా కేంద్రంలో ఆంధ్ర మహిళా మహాసభ సహకారంతో ప్రతిష్టాత్మకమైన ఫిజియోథెరపీ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. జిల్లా వాసులకు వారానికో శుభవార్త అందుతుందన్నారు. ఇదే నెలలో దివిటిపల్లి వద్ద ఐటీ పార్కులో అమర్‌రాజా బ్యాటరీ కంపెనీతో ఎంవోయూ కుదిరిందన్నారు. అలాగే మన్యంకొండ ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరయ్యాయన్నారు.
రోప్‌వేతోపాటు ఆధునాతన సౌకర్యాలతో టూరిజం హోటల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించనున్నట్లు చెప్పారు. జనవరి 2 నుంచి నర్సింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఫిజియోథెరపీ కళాశాలకు దేశ, విదేశాల్లో మంచి ఆదరణ ఉంటుందన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.ఎంబీబీఎస్‌లో సీటు రాని వారు ఫిజియోథెరపీకే ప్రాధాన్యత ఇస్తారన్నారు. జిల్లాలో కళాశాల ఏర్పాటు చేసినందుకు ఐవీఆర్ కృష్ణారావు, మహిళా సభ జనరల్ సెక్రటరీ లక్ష్మీసుందరిని అభినందించారు.
ఐవీఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్రమహిళా సభ లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేసే సంస్థ అని అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఫిజియోథెరపీ కాలేజీకి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో రెం డు రోజుల్లోనే అనుమతి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌తో ఎన్వోసీ, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో జీవో ఇప్పించారన్నారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద ఉన్న ఆంధ్ర మహిళా సభ సముదాయంలోనే ఫిజియోథెరపీ కాలేజీ ఏర్పాటు చేస్తామని.., జనవరి నుంచి 50 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభిస్తామన్నారు. రూ.కోటితో హాస్టల్ భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 19 : ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్రలను అధిగమించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అభివృద్ధి పనుల వెనక ఎంతో శ్రమ ఉంటుందన్నారు. నూతన కోర్టు భవనానికి పదెకరాలు కేటాయించినందుకుగానూ జిల్లా కోర్టులో మంత్రిని బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరో రూ.100 కోట్లు ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎంతో అభివృద్ధి జరుగుతున్నదని, కొందరు పనులను అడ్డుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని హెచ్చరించారు.
రూ.9,500 కోట్లతో ఏర్పాటు కానున్న అమర్‌రాజా కంపెనీ ద్వారా పదివేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలో ఎయిర్‌పోర్టును కూడా ఏర్పాటు చేసుకుందామన్నారు. అనంతరం కోర్టులో పనిచేస్తున్న ఫయాజ్‌కు రూ.1.20 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, ప్రధానకార్యదర్శి లక్ష్మారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అవేజ్, కార్యదర్శి మద్దూర్ కృష్ణ, న్యాయవాదులు ప్రతాప్‌కుమార్, జీపీ మనోహర్, జిల్లా కోర్టు పీపీ బెక్కెం జనార్దన్, పీపీలు స్వదేశీ, చంద్రశేఖర్, మురళీకృష్ణ, పరందాములు, రాజీవ్, న్యాయవాది కరుణాకర్, న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, మీడియా ఇన్చార్జి టి.కృష్ణ, న్యాయవాదులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 19 : అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చీ ఆవరణలో సోమవారం క్రిస్టియన్లకు ప్రభుత్వం అందజేసిన దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా సర్వమతాలకు నిలయమని, అంద రూ కలిసిమెలిసి ఉంటారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కులమతాలకతీతంగా అన్ని పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వం తరఫున కానుకలు కూడా ఇస్తుందన్నారు.
అందరూ చల్లగా ఉండాలని యేసు ప్రభువును వేడుకున్నట్లు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం యేసు ప్రభువు చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు. అంతకుముందు కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్, సుందర్‌పాల్, ఆర్డీవో ప్రేమ్‌రాజ్, అర్బన్ తాసిల్దార్ పార్థసారధి, కౌన్సిలర్లు గోవిందు, రాణి, స్వదేశ్అడ్వకేట్, యోహాన్, బెంజిమెన్, యేసుపాదం తదితరులు పాల్గొన్నారు.
– ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్