మూసాపేట, అక్టోబర్ 17 : గొలుసుకట్టు కాల్వలకు గండీ పడింది. కాల్వలో వెళ్లాల్సిన వరద చెరువు నీళ్లు పంట పొలాల వెంట వెళ్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయ ని నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. మూసాపేట చౌటచెరువు నుంచి ఎర్రకాల్వ ద్వారా సంకలమద్ది, కొమిరెడ్డిపల్లి, పొన్నకల్, దుబ్బపట్టి, నాగాయపల్లి, రాచాల గ్రామాల చెవులకు వరద నీరు వెళ్తుంది. కానీ ఆ కాల్వ మూసాపేట చౌట చెరువు నుంచి అలుగు ద్వారా వస్తున్న వరద నీరు ఎర్ర కాల్వ నుంచి కొంత దూరం రాగానే కాల్వకు గండీ ప డింది.
వరద నీరు అంతా దిగువకు వెళ్లకుం డా పంట పొలాల వెంట వెళ్తున్నది. దీంతో పంటలు కొతకు గురై నష్టం జరుగుతుందని బాధిత రైతులు అధికారులకు చెప్పి నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దిగువన ఉండే ఆరు గ్రామాల్లో ఉండే చెరువులు, కుం టలను నింపి వాటి ద్వారా పంటలకు చెరువు కాల్వల ద్వారా సాగునీరు అం దించడం జరుగుతుంది. కానీ మొదట్లోనే కా ల్వకు గండిపడి నీరు వృథా కావడంతోపాటు, పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతు లు ఆరోపిస్తున్నారు. కరెంటు వైర్లు తెగి కాల్వలో పడి నా పట్టించుకోవడం లేదని, ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.
పూర్వ కాలం నుంచి చౌట చెరువు కాల్వ అం టేనే పెద్ద కాల్వ. ఆ కా ల్వలో భారీగా వరద నీ రు చెరువులకు వెళ్తుం ది. కాల్వకు మరమ్మతు లు చేయకపోవడంతో కాల్వకు గండి ప డింది. కాల్వ నీళ్లు పంట పొలాలలో నుం చి వెళ్తుండడంతో పంట లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. 15 రోజులుగా కరెంటు స్తంభాలు పడిపోయాయని, పంటలు దె బ్బతుంటున్నాయని, కోతకు గురి అ య్యిందని చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో మూసాపేట తాసీల్దార్కు కూడా ఫిర్యాదు చేశాం. కానీ ఎలాం టి ప్రయోజనం లేదు. అధికారులు స్పం దించి కాల్వకు మరమ్మతులు చేసి తమకు న్యాయం చేయాలి.
– రాంచంద్రయ్య, రైతు, మూసాపేట గ్రామం