Road Accident | బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం
జోగులాంబ గద్వాల జిల్లా కోదండపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు.
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కోదండపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కొదండపురం సమీపంలో జాతీయ రహదారి 44పై కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు.. వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

