నారాయణపేట, మార్చి 13 : పల్లె ప్రకృతి వ నాల్లో దివ్యాంగులకు ఉపాధి కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి అడివయ్య అన్నారు. పట్టణంలోని ఎన్పీఆర్డీ జిల్లా విస్త్రృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే పింఛన్ విధానం అమలు చేయాలని కోరారు. ఉ ద్యోగ నోటిఫికేషన్లలో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉ న్న బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నా రు. దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేందు కు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలన్నా రు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడంతో దివ్యాంగులు రిజర్వేషన్లు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దివ్యాంగులపై లైంగిక వేదింపులు అరికట్టాలని, మానసిక ది వ్యాంగుల సంరక్షణ కోసం నిధులు కేటాయించాలన్నారు. దివ్యాంగుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక పాలసీని ప్రకటించాలన్నారు. ఎన్పీఆర్డీ జిల్లా అ ధ్యక్షుడు కాశప్ప, కార్యదర్శి రాధమ్మ మాట్లాడు తూ దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై స ర్వే నిర్వహిస్తున్నామని, సర్వేలో వచ్చిన సమస్యలపై ఏప్రిల్ 4న తాసిల్దార్ కార్యాలయాల ఎదుట, 23, 24 తేదీల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు, 25న మహా ధర్నా లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం లో జిల్లా నాయకులు హన్మంత్రెడ్డి, లక్ష్మి, ఆంజనేయులు, రవి, కృష్ణ, నారాయణపేట, దామరగి ద్ద, మద్దూర్, ఊట్కూర్, మాగనూర్, మండలాలకు చెందిన దివ్యాంగులు పాల్గొన్నారు.