జోగులాంబ గద్వాల : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గద్వాల పట్టణంతో పాటు గద్వాల మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆదివారం తెల్లవారు జాము నుంచే చిరుజల్లు కురుస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా సరైన వర్షాలు లేకపోవడం, మరోవైపు జూరాల కుడి కాలువ ద్వారా సాగునీరు సకాలంలో అందకపోవడంతో పంటలు ఎండిపోయే స్థితికి చేరాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కురుస్తున్న ఈ వర్షం పంటలకు ప్రాణవాయువుగా మారి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.