మక్తల్, ఫిబ్రవరి 14 : షేర్ మార్కెట్ పేరు తో పెట్టుబడులు పెట్టించి పరారైన వ్యక్తి నుం చి డబ్బులు ఇప్పించాలని బాధితులు డిమాం డ్ చేశారు. శుక్రవారం మక్తల్ పోలీస్‌స్టేషన్ వద్దకు బాధితులు పెద్ద ఎత్తున చేరుకొని పీఎస్ గేటు ఎదు ట బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన సుభాని మక్తల్‌లో షేర్ మార్కెట్ పేరుతో పలువురిని నమ్మించాడన్నారు. దీంతో అధికంగా వడ్డీ వస్తుందని ఆశపడి మక్తల్‌కు చెందిన పలువురు డబ్బులు పెట్టుబడి పెట్టారని తెలిపారు.
మొదల్లో వడ్డీ అందిస్తూ వచ్చారని, దీంతో నమ్మిన జనం రూ.లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారన్నారు. 2021లో డబ్బులతో పరారీ కావడంతో పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందన్నారు. కాగా సుభాని ఇక్కడి ప్రజలను మోసి చేసిన విధంగానే నెల్లూరు జిల్లా వాసులను మోసం చేసే క్రమంలో జైలుపాలయ్యాడని చెప్పారు. దీంతో అక్కడి పోలీసులను అరెస్టు చేశారని, ఇక్కడి పోలీసులు వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
సుభానీ నుంచి తాము పెట్టిన డబ్బులు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సమస్య ఏపీ పోలీసుల పరిధిలో ఉందని, అకడి అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా బాధితులు వినలేదు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే శ్రీహరి పీఎస్ వద్దకు చేరుకొని న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఎస్పీతో ఇప్పటికే మాట్లాడామని, మూడ్రోజుల తర్వాత మరోసారి కలిసి సుభాని విషయం మాట్లాడుతానని, అవసరమైతే కావలికి వెళ్లి ఇక్కడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.