కల్వకుర్తి, డిసెంబర్ 10 : కల్వకుర్తి మున్సిపాలిటీకి ఉద్యానవనాలు తలమానికంగా నిలుస్తున్నాయి. ప్ర జలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉద్యానవనాల్లో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం ఆటవస్తువులు వంటి సదుపాయాలు పట్టణవాసులను ఆ కర్షిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానికులు పిల్లలతో కలిసి పార్కుకు వెళ్లి సేద తీరుతున్నా రు. సీనియర్ సిటిజన్లు, యువకులు వాకింగ్ చేశాక వ్యాయామం చేస్తున్నారు. కల్వకుర్తి పట్టణంలో నాలు గు చోట్ల టీయూఎఫ్ఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనా న్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నిధు లు వెచ్చించి ఓపెన్జిమ్లతో కూడిన పార్కులు ఏర్పా టు చేశారు.
రూ.5.17 కోట్ల అంచనా వ్యయంతో పా ర్కులు, ఓపెన్‌జిమ్‌ల నిర్మాణం చేపట్టారు. కోల్‌బావి వద్ద రూ.2.37 కోట్లు, హరహరటౌన్ షిప్లో రూ. 1.40కోట్లు, వేంకటేశ్వర వెంచర్లో రూ.70 లక్షలు, రాంచంద్ర రెసిడెన్సిలో రూ.70 లక్షలతో పార్కులు, ఓపెన్‌జిమ్‌లను నిర్మించారు. అలాగే మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పట్టణప్రగతి నిధుల నుంచి రూ.2 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పార్కు, ఓపెన్ జిమ్ పనులు ప్రారంభమయ్యాయి. వాకింగ్‌ట్రాక్ చుట్టూ రకరకాల పూల మొక్కలు, పచ్చనిగడ్డిని పెంచుతున్నారు. పార్కులను అభివృద్ధి చేయడంతో చిన్నారులు, మహిళలతో కోలాహాలంగా మారుతున్నాయి. ఉదయం వేళ యువకులు జిమ్ చేస్తుంటే.. వృద్ధులు ట్రాక్‌లలో వాకింగ్ చేస్తుంటారు. మున్సిపాలిటీ అధికారులు పార్కులను అభివృద్ధి చేయడంపై పట్టణవాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం..
కల్వకుర్తి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు పట్టణ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. పార్కుల అభివృద్ధితోపాటు పట్టణంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నం. మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పట్టణవాసులు భాగస్వాములు కావాలి.
– ఎడ్మ సత్యం, మున్సిపల్ చైర్మన్, కల్వకుర్తి
సెలవుల్లో తప్పక వెళ్తా..
హరహరటౌన్షిప్ పార్కు మా ఇంటికి దగ్గరగా ఉంటుంది. సెలవుల్లో పిల్లల వెంట పార్కుకు వెళ్తాను. చిన్నారులు చాలా ఉత్సాహంగా గడుపుతారు. పచ్చని రంగురంగుల పూలమొక్కలు ఉండడంతో ఎంత సమయమైనా గడపాలనిపిస్తుంది. పార్కులు ఏర్పాటు చేసిన బల్దియా పాలకవర్గానికి అభినందనలు.
– దీప్తిరెడ్డి, గృహిణి, తిలక్‌నగర్