మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
మహనీయుల స్ఫూర్తి ని యువత ఆదర్శంగా తీసుకొని వారు చూపిన మార్గంలో నడవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలవ్యుడు జయంతి వేడుకలకు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి పాల్గొని నివాళులర్పించారు.
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 17 : మహనీయుల స్ఫూర్తి ని యువత ఆదర్శంగా తీసుకొని వారు చూపిన మార్గంలో నడవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలవ్యుడు జయంతి వేడుకలకు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ మహనీయుల చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఆలోచనతో తమ హయాంలో జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్ట్‌లో మహనీయుల విగ్రహాలు ఏర్పా టు చేశామన్నారు. ఎరుకల కులస్తులకు కేసీఆర్ ప్రభుత్వంలో 10శాతం రిజర్వేషన్ల పెంపుతో ఆదివాసులు, గిరిజన, కోయ, గోం డ్రు, లంబాడీలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని వివరించారు.
పండుగ సాయన్న ఆశయాలు కొనసాగించాలి
బహుజన వీరుడు రాబిన్‌హుడ్ పండుగ సాయన్న ఆశయాలను కొనసాగించాలని, ఆయన ఒక ముదిరాజు సామాజిక వర్గనికి కాకుండా బహుజనుల బాగు కోసం పోరాటం చేసిన మహనీయుడని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో పండుగ సాయన్న జయంతి పురస్కరించుకొని ఆయ న విగ్రహానికి ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగ సాయన్న చరిత్రను వెలికితీసి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేశామన్నారు. తన హయాంలో ఆయన విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అనంతరం పండు గ సాయన్న సమాధిని సందర్శించి నివాళులర్పించారు. కార్యక్రమం లో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, నాయకులు శివరాజ్, గణేశ్, రవికిషన్, నవకాంత్, సుధాకర్, మల్లేశ్, సత్యం, కిషన్ పవర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

