రామోజీరావు మృతి బాధాకరం
అతి సామాన్య కు టుంబంలో జన్మించి, అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం తెల్లవారుజామున రామోజీరావు మృతి చెందారనే విషయం తెలియడంతో ఆవేదనకు గురయ్యారు.
- సంతాపం తెలిపిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బండ్ల, మాజీ ఎమ్మెల్యే చిట్టెం
మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 8 : అతి సామాన్య కు టుంబంలో జన్మించి, అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం తెల్లవారుజామున రామోజీరావు మృతి చెందారనే విషయం తెలియడంతో ఆవేదనకు గురయ్యారు. ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో బతికారని, తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, వి లువలు జోడించిన వ్యక్తని కొనియాడారు. సినిమా, వినో ద రంగానికి ఆయన అందించిన సేవలు చిరకాలం గు ర్తుండిపోతాయన్నారు. రామోజీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూ తి తెలిపారు. గతంలో రామోజీరావును కలిసినప్పటి ఫొ టోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రామోజీ ఖ్యాతి మరొకరికి అసాధ్యం : బండ్ల
గద్వాల, జూన్ 8 : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంపాదించిన గొప్ప ఖ్యాతి మరెవరికీ సా ధ్యపడదని.. అలాంటి మహోన్నత వ్యక్తి మృతి చెందడం బాధాకరమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. రామోజీరావు సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగారని.. జీవితాంతం నిబద్ధత, క్రమశిక్షణతో ఉన్నారన్నారు. పత్రి క, టీవీ, సినిమా రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచాయని కొనియాడారు. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీ చిరస్మరణీయులని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
సేవలు చిరస్మరణీయం : చిట్టెం
మక్తల్, జూన్ 8 : రామోజీరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో బాధను మిగిల్చిందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. రామోజీరావు మరణించిన విషయం తెలియడంతో శనివారం మక్తల్‌లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాన్య కుటుంబంలో జన్మించిన రామోజీరావు అసామాన్య విజయాలు సాధించారని అన్నారు. పత్రికను స్థాపించి జర్నలిజానికి, సినిమా, వినోద రం గంలో ఆయన సేవలు చెరగని ముద్ర వేశాయన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

