ఆంక్షల్లేకుండా మాఫీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న రైతు రుణమాఫీలో ఆంక్షలు లేకుండా రైతులకు వ ర్తింపజేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు.
- రైతులకు మద్దతుగా చేసే ధర్నాను విజయవంతం చేయాలి
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి టౌన్, ఆగస్టు 21 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న రైతు రుణమాఫీలో ఆంక్షలు లేకుండా రైతులకు వ ర్తింపజేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం లో 40 శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ కాలేదని, సీఎం రుణమాఫీ పూర్తయిందని చెప్తుంటే మంత్రులు తలా ఓ మాట చెబుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.
అనేక ఆంక్షలు పెట్టి కర్షకులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ ఆం క్షలు లేకుండా రుణమాఫీ చేయాలని అప్పటిదాకా ప్ర భుత్వంపై పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ముందు మాఫీ అందరికీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఎన్నికలు కాగానే మాఫీ కోసం రూ.40వేల కోట్లు అవసరమని సీ ఎం చెప్పారని, కానీ క్యాబినెట్ మాత్రం కేవలం రూ. 31 వేల కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు.
బడ్జెట్లో రూ.26వేల కోట్లు కేటాయించి కేవలం రూ. 18వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, అందుకని ధర్నా ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. గురువారం చేపట్టే రైతుల ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు గట్టుయాదవ్, లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, విజయ్‌కుమార్, రఘువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

