సర్వే ఆపుతారా..? ఆత్మహత్య చేసుకోవాలా..?
నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వేకు రైతుల నుంచి నిరసన వ్య క్త మవుతోంది. నిత్యం పను లు చేసేందుకు అధికారు లు రావడం.. తమ భూ ముల్లో అనుమతి లేకుండా సర్వే ఎలా కొనసాగిస్తారని రైతులు అడ్డుకుంటున్నా రు.
- పెట్రోల్ బాటిల్‌తో కాట్రేవుపల్లి రైతు హెచ్చరిక
- సర్వే కోసం వచ్చిన అధికారుల అడ్డగింత
- చేసేది లేక పనులు నిలిపివేసిన తాసీల్దార్
- నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులు నిలిపివేయాలని డిమాండ్
మక్తల్, ఫిబ్రవరి 24 : నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వేకు రైతుల నుంచి నిరసన వ్య క్త మవుతోంది. నిత్యం పను లు చేసేందుకు అధికారు లు రావడం.. తమ భూ ముల్లో అనుమతి లేకుండా సర్వే ఎలా కొనసాగిస్తారని రైతులు అడ్డుకుంటున్నా రు. సోమవారం మక్తల్ మండలం కాట్రేవుపల్లి స ర్వే కోసం వెళ్లిన అధికారులకు భంగపాటు తప్పలేదు. నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ ములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నీటిపారుదల, రెవెన్యూ శాఖాధికారులు భూ సర్వే చేపట్టడానికి పోలీస్ బందోబస్తుతో రైతుల పొలాల్లోకి వెళ్లారు.
విషయం తెలుసుకొన్న రైతులందరూ పెద్ద ఎత్తున చేరుకొని అడ్డుకున్నారు. అయినా వినని అధికారులు మీరు ఆందోళన చేసినా పనులు ఆగవని బెదిరించే యత్నం చేశారు. అయినా రైతులు వినలేదు. దీంతో పోలీసులతో కలిసి రైతులు భూముల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక భూమి కోల్పోతున్న కాట్రేవుపల్లికి చెందిన రైతు వెంకటేశ్‌గౌడ్ పెట్రోల్ బాటిల్‌తో అధికారుల ముందుకొచ్చాడు. సర్వే పనులు నిలిపివేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
దీంతో తాసీల్దార్ సతీశ్‌కుమార్ చేసేదిలేక అధికారులతో సర్వేను నిలిపివేయించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ రైతులతో మాట్లాడుతూ.. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఏ రైతు ఎంత భూమి కోల్పోతున్నారన్న విషయాన్ని పరిగణలోకి తీసుకునేందుకే సర్వే చేపడుతున్నామని తెలిపారు. ఇది ఫైనల్ సర్వే కాదని సూచించినా ఎవరూ వినలేదు. దీంతో నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సర్వే పనులు నిలిపివేశారు. రైతులు భారీగా తరలిరావడంతో ఏం చేయాలో తోచక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్డీవో వద్దకు ఐదు మంది రైతులను తాసీల్దార్ తీసుకెళ్లాడు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

