ప్రచారం కొండంత రుణమాఫీ కొంత
కాంగ్రెస్ సర్కారు అట్టహాసంగా ప్రకటించిన రుణమాఫీ పథకం ఆదిలోనే అబాసుపాలయ్యింది. రూ.2లక్షలలోపు రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పి గురువారం రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసింది.
- గందరగోళంగా మొదటి విడుత పంపిణీ ప్రక్రియ
- రూ.లక్షలోపు అర్హుల జాబితాలో పేర్లు మాయం
- దివిటిపల్లి క్లస్టర్లో చనిపోయిన రైతుల పేర్లు
- రైతువేదికల వద్ద ప్రజాప్రతినిధులు, అధికారుల నిలదీత
- ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని దాటవేత
- ప్రభుత్వ తీరుపై కర్షకుల అసహనం
మహబూబ్‌నగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కారు అట్టహాసంగా ప్రకటించిన రుణమాఫీ పథకం ఆదిలోనే అబాసుపాలయ్యింది. రూ.2లక్షలలోపు రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పి గురువారం రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసింది. అందులోనూ కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం కొండంత చేసి గోరంత మాఫీ చేయడంతో రైతాంగం విస్తుపోతున్నది.
అర్హుల జాబితాలో త మ పేర్లు లేకపోవడంతో నిరాశకు గురై ఏ నిబంధనల ప్రకారం రుణమాఫీ చేశారో చెప్పాలని రైతువేదికల వద్ద సంబురాలకు వచ్చిన అధికారులను ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలం దివిటిపల్లి క్లస్టర్లో కొంతమంది రైతులు చనిపోయిన వారి పేర్లు రుణమాఫీలో పే ర్లు రావడం, బతికున్న తాము అర్హులము కాదా అంటూ నిలదీశారు.
రుణమాఫీ కొంతమందికే ఇవ్వడం, మరోవైపు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించకపోవడంతో ఇదేం పాలన అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. రుణమాఫీ ఎందుకు కాలేదని అధికారులను నిలదీయ గా, ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో జాబితా ప్రకటిస్తామని దాటవేశారు. వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయలోపం కారణంగా చాలా మంది రైతుల పేర్లు మాయమైనట్లు స్పష్టంగా కనిపిస్తున్న ది. ఎంతమంది రుణమాఫీకి అర్హులనే విషయంపై అధికారులకే క్లారిటీ లేదు. రుణమాఫీ కోసం త్వరలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని, అర్హులు ఎవరైనా ఉంటే ఫిర్యా దు చేయవచ్చని చెబుతున్నారు.
మొదటి విడుత రుణమాఫీ వివరాలు..
రుణమాఫీ పథకంలో సవాలక్ష నిబంధనలు చాలామంది రైతులకు శాపంగా మారాయి. ప్రభుత్వం ఇచ్చి న గైడ్‌లైన్స్ ప్రకారమే ప్రకటించామని అధికారులు చెబుతున్నా ఎక్కడా పొత్తు పొంతన లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 39,380 మంది రైతులకు సంబంధించి రూ.211కోట్లు జమ చేసినట్లు అధికారులు ప్రకటించారు. వనపర్తి జిల్లాలో 28,408 మంది రైతులకు రూ.157 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలో లక్షా 40వేల మందికి గా నూ మొదటి విడుతగా 24,398 మంది రైతులకు రూ.144కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలో మొ త్తం 46,708 మంది రైతులకు గానూ రూ.270కోట్లు, నారాయణపేట జిల్లాలో 28,684 మంది రైతులకు రూ.165 కోట్ల రుణమాఫీని బ్యాంకులకు చెల్లించినట్లు ప్రకటించారు.
రైతువేదికల వద్ద తుస్సుమన్న సంబురాలు..
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడంపై గురువారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని రైతు వేదికల వద్ద సంబురాలకు పిలుపునిచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆర్డీవోలు, తాసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు ఎక్కడికక్కడే వేదికల వద్ద సంబురాల్లో పాల్గొనాలని చెప్పారు. కాగా, రుణమాఫీ ప్రకటనలో గందరగోళం నెలకొనడంతో సంబురాలు తుస్సుమన్నాయి. మాకెందుకు రుణమాఫీ కాలేదని చాలా మంది రైతులు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక మంత్రి, ఎమ్మెల్యేలు మాత్రం గత పాలనను విమర్శిస్తూ మమా అనిపించారు.
ఎదిరలో చనిపోయిన రైతులకు వర్తింపు..
మహబూబ్‌నగర్ అర్బన్ మండలం ఎదిర గ్రామంలో 1,300 మంది రైతులు రూ.లక్షలోపు రుణమాఫీకి అర్హు లు. అయినప్పటికీ కేవలం 635 మందికి మాత్రమే వర్తింపజేశారు. ఇందులో ముగ్గురు, నలుగురు చనిపోయిన రై తుల పేర్లు రుణమాఫీ జాబితాలో రాగా.. చాలా మంది అభ్యంతరం తెలిపారు. దాదాపు 70 శాతం మంది తమకు రుణమాఫీ వర్తింపజేయలేదని వాపోయా రు. చనిపోయిన రైతులు అర్హు లైనప్పుడు బతికున్న తాము ఎందుకు అర్హులం కాదం టూ అధికారులను ప్రశ్నించారు. రెండు, మూడెకరా లు ఉన్న రైతులకు మా త్రమే తొలి జాబితాలో స్థానం దక్కిందని, ఆగస్టు 15 వరకు దశలవారీగా రుణమాఫీ ఉంటుందని అ ధికారులు నచ్చజెప్పి పంపించారు. రుణమా ఫీ అయ్యిందో లేదోనని చాలా మంది రైతులు వ్యవసాయ అధికారు లు, బ్యాంకర్ల చుట్టూ తి రగడం కనిపించింది.
సరిగా రాలేదు..
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒ కే దఫాలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇచ్చిన కొద్దోగొ ప్పో కూడా సరిగా రాలేదు. నాకు రెండున్నర ఎకరాలు ఉం ది. ప్రాథమిక సహకార సంఘంలో రూ.90వేలు రు ణం తీసుకున్నా. మొదటి విడుతలో రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ లిస్ట్‌లో నాపేరు లేదు. ఏ విధంగా రుణమాఫీ చేస్తున్నారో అర్థం కావడం లేదు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి.
– బిట్ల సత్యనారాయణరెడ్డి, మర్రిపల్లి, చారకొండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
రైతులందరికీ మాఫీ చేయాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం కొందరి కి రుణమాఫీ చేసి, మరికొందరి కి చేయకపోవడం సరికాదు. 2017లో రూ.80వేల రుణం తీసుకున్నా. రుణమాఫీ కాలే దు. 2018 నుంచి రుణం తీసుకున్న రైతులకే మాఫీ చేస్తే అం తకుమందు తీసుకున్న వారు రైతులు కాదా? రైతులందరికీ సమాన న్యాయం చేయాలి.
– వీరేశ్, రైతు, తీలేరు, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా
మేము రైతులం కాదా?
పంటేయనీకె రూ.45వేలు అప్పు తీసుకున్నా. కాంగ్రెస్ సర్కారు రూ.లక్షలోపు పైసలు మాఫీ చేస్తమని చెప్పిండు. సారోళ్లు ఇచ్చిన పేపర్లలో నా పేరు లేదంట. నేను రైతును కాదా. పంట కోసం అప్పు తీసుకునోళ్లందరికీ మాఫీ చేయాలే. పాత సర్కారోళ్లు చెప్పినకాడికి అందరికీ రుణం మాఫీ చేసిండ్రు. వీళ్లు మాట్కం కొందరికి ఇచ్చి మిగతోళ్లకు ఇయ్యమంటే బాగుండదు. మా బాధలను అర్థం జేస్కొని అప్పు మాఫీ చేయాలి.
– గొల్ల రాములు, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా
సర్కారు మోసం చేస్తున్నది..
కర్షకులను కాంగ్రెస్ సర్కారోళ్లు మోసం చేస్తున్నరు. బ్యాంకులో అప్పు మాఫీ చేస్తమని ఏ లెక్కన పైసలు ఇస్తున్నరో తెలుస్తలేదు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.95వేల పంట రుణం తీసుకున్నా. రుణం మాఫీ చేసే లిస్టులో నా పేరు లేదు. ఎందుకు లేదంటే ఎవరూ ఏం చెప్తలేరు. రుణమాఫీ పేరుతో సర్కారు రైతులను మోసం చేస్తున్నది.
– కురువ మద్దిలేటి, బుక్కాపురం, జోగుళాంబ గద్వాల జిల్లా
మాఫీ అయ్యిందో లేదో తెలుస్తలేదు..
నాకు రెండెకరాల భూమి ఉన్నది. పత్తి పంట సాగు చేశా. అలంపూర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.75 వేల పంట రుణం తీసుకున్నా. కాంగ్రెస్ సర్కారోళ్లు ఇచ్చిన లిస్టులో నా పేరు లేదు. సారోళ్లను అడిగితే చెప్తలేరు. అప్పు మాఫీ అ య్యిందా, కాలేదా అనేది ఏం తెలుస్తలేదు.
– బోయ మద్దిలేటి, బుక్కాపురం, జోగుళాంబ గద్వాల జిల్లా
రూ.40వేల రుణం మాఫీ కాలేదు..
కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన రుణమాఫీ గందరగోళంగా ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలకతీతంగా రైతుబంధుతోపాటు రుణమాఫీ చేశారు. కాంగ్రెస్ పాలనలో పారదర్శకంగా లేదు. కొత్తకోట ఏపీజీవీబీలో రూ.40వేల రుణం తీసుకున్నా. తీరా రుణమాఫీ లిస్టులో పేరు లేదు. కొందరికి మాఫీ చేసి ఇంకొందరికి ఎలా ఇవ్వరు.
– నర్సింహాగౌడ్, కొత్తకోట, వనపర్తి జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

