భూసేకరణ పనులు వేగవంతం చేయండి : మహబూబ్‌నగర్ కలెక్టర్

మహబూబ్‌నగర్ : వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణను వేగవంతం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న భూముల్లో కొనసాగుతున్న తవ్వకాల పనులకు రైతులు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఇతర శాఖ అధికారులతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పనుల పురోగతిని సమీక్షించారు.
వివిధ రైల్వే ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాల్సిందిగా రైల్వే ఇంజనీర్లు, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పాలమరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్, వల్లూర్, శ్యామ్గడ్డ తండ గ్రామాల్లోని రైతులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న భూముల్లో తవ్వకాల పనులను అడ్డుకుంటున్నారని రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆర్డీఓ రైతులతో మాట్లాడి పనులను అడ్డుకోకుండా చూడాలన్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న భూముల్లో పనులు యదావిధిగా జరుగుతాయన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

